వైసీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం గుంటూరు మిర్చియార్డుకు చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో అక్కడకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, అప్పిరెడ్డి తదితర నేతలు జగన్ కు స్వాగతం పలికారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఇది సభ కాదని… కేవలం రైతులతో జగన్ మాట్లాడతారని వైసీపీ నేతలు చెపుతున్నారు. కాసేపట్లో రైతులతో జగన్ మాట్లాడనున్నారు.