Saturday, February 22, 2025
Homeవ్యాపారంజేఈఈ మెయిన్‌లో మరోసారి రికార్డులు బద్ధలు కొట్టిన అన్‌అకాడమీ

జేఈఈ మెయిన్‌లో మరోసారి రికార్డులు బద్ధలు కొట్టిన అన్‌అకాడమీ

ముంబయి: భారతదేశపు ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 1 ఫలితాల్లో మరోసారి సరికొత్త ప్రమాణాలు నెల్కొలిపింది. అన్‌అకాడమీకి చెందిన 920పైగా విద్యార్థులు 99 పర్సంటైల్‌ కంటే ఎక్కువ సాధించి, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విద్య అనుసంధానంతో కూడిన హైబ్రిడ్‌ లెర్నింగ్‌ విధాన ప్రభావం చూపింది. ఈ అద్భత ఫలితాలపై అన్‌అకాడమీ సహవ్యవస్థాపకులు సుమిత్‌ జైన్‌ తమ ఆనందాన్ని వ్యక్తంచేస్తూ, మా విద్యార్థులు మరోసారి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. ఈ ఫలితాలు మా అధ్యాపకుల అంకితభావాన్ని, మా స్టడీమెటీరియల్‌ బలాన్ని, మా హైబ్రిడ్‌ బోధనా విధాన ప్రభావాన్ని తెలియచెప్తున్నాయని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే. మా విద్యార్థులు జ్‌ఈఈ, నీట్‌, ఇతర పోటీ పరీక్షలలో రికార్డులు బద్దలు కొడతారని విశ్వశిస్తున్నట్లు తెలిపారు. టాప్‌ స్కోర్లు సాధించిన వాళ్లలో సౌరవ్‌ 100 పర్సంటైల్‌, ఉజ్వల్‌ కేసరి(99.999 పర్సంటైల్‌), సముద్ర సర్కార్‌(99.992 పర్సంటైల్‌), శ్రీజన్‌ అగర్వాల్‌ (99.98 పర్సంటైల్‌), యశ్‌ కుమార్‌ (99.98 పర్సంటైల్‌) ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు