Sunday, June 15, 2025
Homeజిల్లాలుకర్నూలుఘనంగా మేడే ఉత్సవాలు

ఘనంగా మేడే ఉత్సవాలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో 139వ మేడే ఉత్సవాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మే 1 /1886న చికాగాలో ఆవిర్భావించిందన్నారు. సుమారు 4 లక్షల మంది కార్మికులు 8 గంటల పని దినం కోసం సమ్మె నిర్వహించారన్నారు. చికాగాలో శాంతియుత ర్యాలీలో పోలీసు అధికారులపై బాంబు విసరినప్పుడు అది హింసగా మారిందని, దీని ఫలితంగా అధికారులు, పౌరులు మరణించారని తెలిపారు. ఈ విషాద సంఘటన కార్మికుల హక్కులకు శక్తివంతమైన సంఘీభావాన్ని రేకెత్తించిందన్నారు.ప్రపంచ సమైక్య కార్మికులను గౌరవించడానికి హై మార్కెట్ సంఘటనలను స్మరించుకోవడానికి ఒక రోజు మేడే ను ప్రకటించిందని, అప్పటి నుంచి మే దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు జయరాము, దుబ్బన్న, శంకర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దస్తగిరి, నాయకులు రెక్కల గిడ్డయ్య, డోలు హనుమంతు, చిన్నోడు, గిడ్డయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు