Tuesday, April 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..

హెడ్మాస్టర్ సీవీ.శేషు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు విద్యార్థులు ఉపాధ్యాయుల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆ పాఠశాల హెడ్మాస్టర్ సి.వి. శేషు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం సివి శేషు మాట్లాడుతూ మన మాతృభాషను ఎన్నటికీ మరువరాదని, మాతృభాష తల్లితో సమానమని తెలిపారు. అమ్మ రూపమే తెలుగు భాష అని, అమృత జలపాతం మన తెలుగు భాష అని, తెలుగు ప్రజలందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని తెలిపారు. ఎన్ని భాషలు నేర్చుకున్న, ఎంత విజ్ఞానం సాధించిన, మాతృభాషను గౌరవించాలని, మాతృభాషలోనే మాట్లాడాలని తెలిపారు. అమ్మలాంటి తెలుగు భాషను గౌరవించాలని భవిష్యత్ తరాలకు మన మాతృభాష గొప్పతనాన్ని చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు