Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు వైద్యము, అన్నదానం చేయడం దైవ సేవతో సమానం

పేద ప్రజలకు వైద్యము, అన్నదానం చేయడం దైవ సేవతో సమానం

కన్వీనర్ సాంబశివుడు
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు వైద్యముతో పాటు అన్నదానం చేయడం దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి-2 కన్వీనర్ సాంబశివుడు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గొట్లూరు, తాడిమర్రి మండలం నర్సంపల్లి లో గల అనాధాశ్రమానికి దాదాపు 600 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా ఈ అనాధ ఆశ్రమంలో వైద్య శిబిరమును కూడా నిర్వహించడం జరిగిందని, ఇందులో 260 మందికి వైద్య చికిత్సలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, సేవాకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు