Saturday, May 3, 2025
Homeజిల్లాలుకర్నూలునిషేధిత భూమిలో ఇంటి పట్టాలు ఇవ్వరాదు

నిషేధిత భూమిలో ఇంటి పట్టాలు ఇవ్వరాదు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 262/A3 నందుగల 3.30సెంట్లు భూమిలో ఎలాంటి ఇంటి పట్టాలు ఇవ్వరాదని ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కార్యదర్శి బొగ్గలు తిక్కన్న పేర్కొన్నారు. శుక్రవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో,తహశీల్దార్ గీతా ప్రియదర్శిని గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 262 /A3నందు ఉన్న ప్రభుత్వ బరెల్ గ్రౌండ్ లో 3. 30 సెంట్లు ఓపెన్ సైటు ఉందని తెలిపారు. ఈ భూమి ప్రభుత్వ ఆర్ఎస్సార్ రికార్డు ప్రకారం స్మశానమని, అందులో ఇది నిషిద్ధ భూమిని సదరి స్థలంలో కొంతమంది గృహాల ఉన్న అనర్హులు కొట్టాలు వేసుకొని కబ్జా ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ భూమిని 2016 సంవత్సరం నుండి కబ్జా కాకుండా కాపాడడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రయోజనాలు కొరకు మాత్రమే ఈ స్థలమును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇటీవల సమస్య లేని ప్రభుత్వ భూముల్లో కొట్టాలు వేసుకున్న వారు పట్టాలకు అప్లై చేసుకోండి అని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. కావున తహశీల్దార్ పొరపాటున కూడా సమస్య ఉన్న నిషేధిత భూమిలో మాత్రమేపట్టాలు ఇవ్వడం గానీ, దరఖాస్తులు స్వీకరించడం గానీ చేయకూడదని విన్నవించారు.
ఈ సర్వేనెంబర్లో మా గ్రామానికి చెందిన కమ్మరి పరమేష్ అనే వ్యక్తి,అమాయక దళితులతో సెంటుకు 5000 వేలు,మూడు సెంట్లు 20000నగదు,
వేల రుపాయలుదండు కొని,(గడచిన) వెనుకటి,తేదీ, నెల, సంవత్సరము, వేసి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి తానే విఆర్వో ఆర్ ఐ.ఇన్సల్ వేసి తహశీల్దార్ సంతకాలతో, సీల్ వేసి ఫేక్ పట్టాలు ఇస్తున్నారని త్వరలో వీటిపై జిల్లా కలెక్టర్ దృష్టికి,జరుగుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు