Friday, February 28, 2025
Homeజిల్లాలుఅనంతపురంమానవాళి అభివృద్ధికి సైన్స్ ఎంతో దోహదపడుతుంది

మానవాళి అభివృద్ధికి సైన్స్ ఎంతో దోహదపడుతుంది

కరస్పాండెంట్ రమేష్

విశాలాంధ్ర, కదిరి : మానవాళి అభివృద్ధికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని కేఎల్ఎన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ రమేష్ తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కరస్పాండెంట్ రమేష్ మాట్లాడుతూ ప్రతిఏత ఫిబ్రవరి 28న జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. సర్ సివి రామన్ భారత ఖ్యాతిని నలువైపుల విస్తరించారని ఆయన సేవలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన వివిధ నమోద నమూనాలు ప్రదర్శన చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు