విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : విద్యార్థులకు నాణ్యమైన అందించాలని మండల విద్యాధికారి – 2 రామ్మూర్తి వంట ఏజెన్సీలను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాధికారి – 2 మద్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వంట ఏజెన్సీలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.