Friday, March 14, 2025
Homeఆంధ్రప్రదేశ్టెన్త్ విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

టెన్త్ విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6.49 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు