చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తీర్మానం
బీజింగ్: నవ శకంలో రాజకీయపరంగా మరిన్ని విజయాలతో దూసుకెళ్లాలని చైనా సంకల్పించింది. ఈ దిశగా చైనా నేషనల్ లెజిస్ట్రేచర్ 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తీర్మానించింది. రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆప్ ది పీపుల్‌లో మంగళవారం జరిగిన ముగింపు సమావేశానికి అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కియాంగ్‌తో సహా ప్రముఖ నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో సభకు హాజరై కొందరు సందడి చేశారు. వార్షిక సదస్సు ముగింపును పురస్కరించుకొని చైనా ఆధునికీకరణ దిశగా మరింత పురోగతి కోసం గొప్ప తోడ్పాటు, నూతన సహకారానికి పునరంకితం కావాలని రాజకీయ సలహాదారులకు రాజకీయ సలహా మండలి పిలుపునిచ్చింది. చైనీస్ పీపుల్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) చైర్మన్ వాంగ్ హునింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సదస్సు… సీపీపీసీసీ రాజకీయ శక్తికి చైనా ప్రజాస్వామిక విజయానికి అద్దంపట్టింది. నవ శకంలో చైనా వ్యక్తిత్వంతో సోషలిజం మార్గంలో మరిన్ని గొప్ప విజయాలు అందుకోగలమని రాజకీయ సలహాదారులు దీమా వ్యక్తం చేశారు. సీపీపీసీసీ జాతీయ కమిటీ స్థాయి సంఘం నివేదిక, కొత్త ప్రతిపాదనలు, రాజకీయ సంకల్పంపై తీర్మానాలు జరిగాయి.
నవ శకంలో మరిన్ని విజయాలే లక్ష్యం
RELATED ARTICLES