Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబీసీ బాలుర హాస్టల్ కు కోకోకోలా కంపెనీ వాటర్ ఫిల్టర్ పరికరాలు పంపిణీ..

బీసీ బాలుర హాస్టల్ కు కోకోకోలా కంపెనీ వాటర్ ఫిల్టర్ పరికరాలు పంపిణీ..

– హాస్టల్ వార్డెన్ విష్ణువర్ధన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లె లో గల బిసి బాలుర కళాశాల హాస్టల్ కు గుంటూరుకు చెందిన కోకో కోల కంపెనీ వారు ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువచేసే ఫిల్టర్ వాటర్ పరికరాలను అందజేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్ విష్ణువర్ధన్ రెడ్డి వాటిని కోకో కోల యజమాని ప్రారంభించి, విద్యార్థులకు తాగునీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హాస్టల్ వార్డెన్) విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా హాస్టల్లో ప్రస్తుతం 130 మంది బాలురు వివిధ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని, తాగునీటి కొరకు చాలా ఇబ్బందులు పడేవారిని, నేడు కోకోకోలా కంపెనీ గుంటూరు వారు ఈ వాటర్ ఫిల్టర్ ను ఇవ్వడం విద్యార్థులకు ఒక వరంలాగా మారిందని తెలిపారు, ఈ వాటర్ ఫిల్టర్ లో నార్మల్, కూల్ వాటర్ కూడా వస్తుందని తెలిపారు. ఎండాకాలంలో ఈ ఫిల్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కంపెనీ వారికి హాస్టల్ విద్యార్థులతో పాటు హాస్టల్ వార్డెన్, సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అంతేకాకుండా హాస్టల్లో4 మరుగుదొడ్లకు కూడా నిర్మాణ పనులను కోకో కోలా కంపెనీ వారే నిర్వహిస్తున్నారని, ఈ నిర్మాణమునకు దాదాపు నాలుగు లక్షల వరకు వారు ఖర్చు పెట్టడం బాలుర అభివృద్ధికి ఎంతకానో తోడ్పడిందని తెలిపారు. ప్రభుత్వం కూడా వివిధ సౌకర్యాలను హాస్టల్ విద్యార్థులకు కల్పించడం జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా హాస్టల్లో కూడా స్టడీ అవర్స్ ను కూడా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరము ఫలితాలు కూడా అనుకున్న రీతిలో రావడం సంతోషాదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు