Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్లోకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి.. జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ అనురాధ

గ్లోకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి.. జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ అనురాధ

విశాలాంధ్ర ధర్మవరం : గ్లోకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి అని, కంటి లోపల పీడనం పెరిగి కంటి నరాన్ని చచ్చు పడిపోయేటట్టు చేస్తుందని జిల్లా అంధత్వ నివారణ అధికారిని డాక్టర్ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు డాక్టర్ అనురాధ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి చూపెట్టెంట్ మాధవి కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాముడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ అనురాధ, డాక్టర్ రాముడు మాట్లాడుతూ గ్లోకోమా (నీతి కాసుల జబ్బు) అంటే ఏమిటి? ఎలా వస్తుంది? వస్తే ఏం చేయాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి అన్న విషయాలను, కంటి సంరక్షణ గూర్చి వారు తెలియజేశారు. ఈ గ్లోకోమా వారోత్సవాలు ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గ్లోకోమా కంటి వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు కళ్ళు కనపడకపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాథమిక దశలోనే గ్లోకోమా లక్షణాలకు వెళితే 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు తరచుగా కంటి అద్దాలు మార్చవలసి రావడం జరగాలన్నారు. వెలుతురు చుట్టూ రంగులు వలయం కనబడడం, తరచుగా తలనొప్పితో పాటు కంటి ఎరుపు, వాంతులు, కనుక్రుడ్డు నొప్పి కలిగి ఉండటం ఈ లక్షణాలు అని తెలిపారు. గ్లోకోమా కంటి పరీక్షలను 35 సంవత్సరాల నుండి 40 వయసు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అంతేకాకుండా పూర్వం కనుక్కుంటూ పై గాయం తగిలిన వారు, స్థిరాఇడ్ మందులు అధికంగా వాడేవారు, షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. రక్తసంబంధం ఉన్నవారులలో ఎవరైనా గ్లోకోమా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ చదవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, ఆప్తాల మీకు ఆఫీసర్ డాక్టర్ ఉరుకుందప్ప, వైద్యులు, రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు