విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : పట్టణంలోని సంజీవ్ నగర్ రెండవ రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారము జనసేన పార్టీ రాయలసీమ ఎలక్షన్ జోనల్ సభ్యులు ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం జనసేన పార్టీ పనిచేస్తుందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలలో పార్టీని గెలిపించుకున్నారు. జన సైనిక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు, గ్రామాలలో రోడ్లు, గ్రామాలలో త్రాగునీటి వసతులు శరవేగంగా చేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నాడన్నారు. కావున ఈనెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ, మహోత్సవం నిర్వహిస్తారు. ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులు లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యాక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహన సభ్యులు అల్తాఫ్, సాధక్, హరి, కరీం, సాదిక్, హనుమేష్ స్వామి జనసైనికులు పాల్గొన్నారు.