టీటీడీ ధర్మాచార్యులు నక్కల వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సబ్సిడీ రేటు పై మైసెట్లు పంచలోహ రాతి విగ్రహాలు ఊరేగింపు గొడుగులు పంపిణీ చేయడం జరుగుతుందని ధర్మాచార్యులు నక్కల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పట్టణంలోని శాంతినగర్ అయ్యప్ప స్వామి దేవాలయం కు, గీతా నగర్ బాటసత్యం దేవాలయమునకు మైక్ సెట్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నార్పల మండలం గొల్లపల్లి గ్రామంలో ఉండు అమ్మవారి దేవాలయానికి మైక్ సెట్ వితరణ చేయడం జరిగిందన్నారు. మన శ్రీ సత్య సాయి జిల్లాలో గ్రామాలు లేదా పట్టణాలలో గల దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సబ్సిడీ రేటు పై మైక్ సెట్ లు, గొడుగులు, రాతి ,పంచలోహ విగ్రహాల కొరకు దరఖాస్తు చేసుకుంటే తెలిపిన తేదీలలో వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని గ్రామ, పట్టణాలలో ఉండు దేవాలయ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
టీటీడీ వారిచే సబ్సిడీ రేట్లపై మైక్ సెట్ లు పంచలోహ, రాతి విగ్రహాలు పంపిణీ
RELATED ARTICLES