ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం:: నాటు సారాను తాగిన, క్రయ,విక్రయాలు జరిపిన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ధర్మవరం మండలంలోని ఓబుల నాయన పల్లి తండా నేలకోట తండా మల్లేనిపల్లి గ్రామాలలో నాటు సారా అనర్థాలపై అవగాహన సదస్సును వారు నిర్వహించారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ నాటు సారా త్రాగడం వల్ల వచ్చే దుష్పరిమాణాలు గూర్చి ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం నవోదయం 2.0 లో భాగంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు స్కూల్ హెడ్మాస్టర్ లు, రెవెన్యూ అధికారులు, వీఆర్వో అండ్ విఆర్ఏ లు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విలేజ్ కానిస్టేబుల్, గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నాటు సారా తాగిన, క్రయ,విక్రయాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం
RELATED ARTICLES