Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లామహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి.. విప్,ఎమ్మెల్యే తంగరాల సౌమ్య

మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి.. విప్,ఎమ్మెల్యే తంగరాల సౌమ్య

మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి.. విప్,ఎమ్మెల్యే తంగరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని పట్టుదలతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు రాష్ట్ర అసెంబ్లీ సెషన్స్ లో ఆమె మాట్లాడిన వీడియోను ఎమ్మెల్యే కార్యాలయం బుధవారం విడుదల చేసింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని దృఢమైన సంకల్పంతో ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు రిజర్వేషన్ ను కల్పించి చట్టం చేయడం జరిగిందని అదే స్ఫూర్తితో అంతకంటే పదింతల సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సంక్షేమం కొరకు భద్రత కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు కెళ్తున్నారంటే నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు రిజర్వేషన్ ప్రక్రియ ఒకటైతే ఆ తరువాత 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పమే మరింత చేదోడువాదోడుగా ముందుకు సాగిందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఆర్థిక పురోగతి సాధించాలని లక్ష్యంతో పని చేస్తున్నారని ఆమె అసెంబ్లీలో బుధవారం మాట్లాడారు తాజాగా 2025 -26 వార్షిక బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎప్పుడూ లేనివిధంగా 4,332 కోట్ల కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,అంగన్వాడి సెంటర్ల బలోపితం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు