Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనారోగ్యంతో రైలు కింద పడి లారీ క్లీనర్ సేక్షావలి మృతి

అనారోగ్యంతో రైలు కింద పడి లారీ క్లీనర్ సేక్షావలి మృతి

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నివాసముంటున్న తండ్రి అబ్దుల్ ఖాదర్ వలీ కుమారుడు షేక్షావలి (24) గురువారం(13/3/25) తెల్లవారుజామున ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, హిందూపురం జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తండ్రి కోళ్ల ఫారం వ్యాపారం చేసుకుంటూ, మృతుడు ఓ లారీ క్లీనర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా మృతుడు సేక్షావలికి అలసరు, గడ్డలు ఉండడంతో తీవ్ర నొప్పితో బాధ పడుతుండేవాడు. అనంతరం తల్లిదండ్రులు అనంతపురం, బెంగళూరు తదితర హాస్పిటల్లో వైద్య చికిత్సలు అందించినా కూడా జబ్బు నయం కాలేదు. దీంతో గత వారం రోజులుగా తాను రైలు కిందపడి చనిపోతాను అని ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు తెలిపేవాడు. అంతేకాకుండా మృతునికి మద్యం అలవాటు కూడా ఉందని తెలిపారు. ఇక జీవితంపై విరక్తి చెంది గురువారం తెల్లవారుజామున ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక అక్క కూడా ఉందని, వివాహం కాలేదని తెలిపారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ రైలు పట్టాల కింద పడిన శవాన్ని చూసి హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రి స్వామి సంఘటనా స్థలానికి చేరుకొని, చుట్టుపక్కల విచారించగా మృతి చెందిన వ్యక్తి కేతిరెడ్డి కాలనీకి చెందిన వాడిని గుర్తించడం జరిగింది. తదుపరి హిందూపురం రైల్వే పోలీసులు మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు