Friday, March 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి14న పౌర్ణమి గరుడసేవ, శ్రీవారి కల్యాణ మహోత్సవ వేడుకలు..

14న పౌర్ణమి గరుడసేవ, శ్రీవారి కల్యాణ మహోత్సవ వేడుకలు..

అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నామని, రాష్ట్రంతో పాటు ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సాంప్రదాయ పద్ధతిలో మన ధర్మవరం పట్టణంలో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ఈనెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేడుకలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కర్తలుగా ఇంద్రాణి గుర్రం శ్రీనివాసులు నవ్య శ్రీ గుర్రం బాలాజీ ఐశ్వర్య గుర్రం సుదర్శన్ గుర్రం హరినారాయణలు వ్యవహరిస్తారని తెలిపారు. అన్నమయ్య సేవా మండలి వారిచే ప్రత్యేక అన్నమయ్య సంకీర్తనలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు