Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్డిఓ ఆఫీస్ ఎదుట సిపిఐ ధర్నా

ఆర్డిఓ ఆఫీస్ ఎదుట సిపిఐ ధర్నా

650-2 సర్వే నంబర్ లో ప్లంబర్లకు ఇచ్చిన స్థలాలలో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని 650-2 సర్వే నంబర్ లో ప్లంబర్లకు ఇచ్చిన స్థలాలలో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో సర్వేనెంబర్ 650-2 లో కొంతమంది నాయకులు దొంగ పట్టాలు తీసుకుని, ప్లంబర్ కాకపోయినా వారు అందరూ కూడా ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేసుకుంటే అధికారులు, మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించకపోవడంతో మీకు ఏమైనా వాటాలు అందుతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున వారు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వ భూమి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అన్యాక్రాంతం అవుతున్న కూడా అధికారులు ఒకపక్క మంత్రి సైలెంట్ గా ఉండడానికి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు అని తెలిపారు.ఇవాళ నిజమైన ప్లంబర్స్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న కూడా ప్లంబర్స్ ను పట్టించుకునే పాపాన పోలేదు అని అధికారులపై మండిపడ్డారు.650-2 సర్వే నెంబర్ లో అనేక అక్రమాలు జరిగినాయని ప్రధాన పత్రికల్లో వచ్చినా కూడా అధికార యంత్రాంగం చర్యలు లేకపోవడం సిగ్గుచేటు అని తెలిపారు. అదేవిధంగా ఇవాళ అధికారుల దగ్గరకు ప్రజలు వారి కష్టాలతో వస్తే అధికారులకు ముడుపులు ఇస్తే గాని పనిచేస్తామని అధికార యంత్రాంగం అంత కూడా తయారవుతుంది అని స్పష్టం చేశారు.ఇప్పటికైనా మంత్రి సత్తి కుమార్ యాదవ్ ఇక్కడ జరుగుతున్నటువంటి భూ అక్రమాలపై స్పందించాలి అని లేకపోతే పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ బాధితులతో పేదలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు,పోలా లక్ష్మీనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు,వెంకటస్వామి,యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా,ఆదినారాయణ,మల్లి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సన్న పెద్దన్న, నాగభూషణ,మహిళా సమైక్య పట్టణ నాయకులు లలిత, లింగమ్మ, ఈరమ్మ,ఎలక్ట్రానిక్స్ ప్లంబర్స్, గోవిందు రాజు, తాజ్, సుబ్బయ్య,రామక్రిష్ణ, శ్రీరాములు, నాగరాజు, మనోహర్, బాబావలి, మసూద్, మస్తాన్, కేశవ,రామాంజి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు