ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ జే. వి.సురేష్ బాబు, ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఎంప్లాయిమెంట్ షీడాపు సంయుక్త అధికారి దీపక్ రెడ్డి, సీడాప్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 5 కంపెనీ ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని 56 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా 32 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వారి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ జాబ్ మేళా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో శుభదాయకమని తెలిపారు. నిరుద్యోగులు ఇటువంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవడం వల్ల వారి కాళ్ళ మీద వారు నిలబడి సంపాదించుకొనే అవకాశం ఉందని తెలిపారు. మున్ముందు కూడా మరిన్ని జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ, ప్లేస్మెంట్ అధికారి తేజ కుమార్, ఏపీ స్టేట్ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సిడాప్ సిబ్బంది, ఎంప్లాయిమెంట్ అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
జాబ్ మేళాకు విశేష స్పందన..
RELATED ARTICLES