విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామానికి చెందిన హరిజన కోడివిల్లి నరసప్ప (54)అనే వ్యక్తి బతుకు తెరువుకోసం బెంగుళూరుకు వలస వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. అక్కడ సిమెంటు పని చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు సంభవించి కుప్పకూలి మృతి చెందారు. గురువారం చిన్నతుంబలం గ్రామానికి తెచ్చిన నరసప్ప మృతదేహానికి టీడీపీ సీనియర్ నాయకులు సిద్ధప్ప దని, వీరేష్ గౌడ్, నీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ, మాజీ ఎంపీటీసీ ఈరన్న, చంద్రశేఖర్ లు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మట్టి ఖర్చుల కోసం 5వేల రుపాయలు ఆర్థిక సహాయం అందజేసి కుటుంబాన్ని ఓదార్చారు. మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.