Saturday, March 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రతి ఒక్కరూ డ్రైవింగ్సె లైసెన్స్ తీసుకోవాలి

ప్రతి ఒక్కరూ డ్రైవింగ్సె లైసెన్స్ తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : ప్రతి ఒక్క పౌరుడు హెల్మెట్ ధరించి, సీటు బెల్టు వేసుకొని ప్రయాణించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుండి 8:15 గంటల వరకు నిర్వహించిన ఆకాశవాణి అనంత మిత్ర ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో రవాణా శాఖ సేవలపై మరియు సమస్యలపై నేరుగా ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు పలు సమస్యలను తెలియజేయగా, రవాణా శాఖ సేవలపై మరియు సమస్యల పరిష్కారం నిమిత్తమే ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్సె లైసెన్స్ తీసుకోవాలని మరియు ప్రతి ఒక్క పౌరుడు హెల్మెట్ ధరించి, సీటు బెల్టు వేసుకొని సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
ఈ సందర్భంగా 17 మంది ఫోన్ ద్వారా పలు రకాల సమస్యలను జిల్లా కలెక్టర్ కు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిటిసి వీర్రాజు, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు