Friday, March 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఏపీ మోడల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశం కొరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. వారు మాట్లాడుతూ మా కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సీసీ, ఎంఈసి గ్రూపులు కలవని, ప్రతి గ్రూపుకు 40 సీట్లు మాత్రమే పరిమితంగా ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టి వారికి 150 రూపాయలు, ఓసి, బీసీ వారికి 200 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కలదని తెలిపారు. ఉచిత విద్యతో పాటు కళాశాలలో బోధన మద్యమం ఆంగ్లంలో ఉంటుందని తెలిపారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు అని తెలిపారు. సంబంధిత జిల్లాలో ప్రభుత్వం లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తీర్ణతలైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశములు పదవ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు ఇవ్వబడుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరి నీ వివరాలకు సెల్ నెంబర్ 7981171568కు గాని 7799004659 కు గాని 6305974274 కు గాని సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు