. ఫలిస్తున్న ఎమ్మెల్యే కూనంనేని కృషి
. మరో 10 డయాలసిస్ బెడ్లు అందుబాటులోకి…
. 200 మంది రోగులకు డయాలసిస్ సేవలు…
. 16న డయాలసిస్ మిషన్స్ ప్రారంభించనున్న కూనంనేని
విశాలాంధ్ర – కొత్తగూడెం అర్బన్ : పేదవర్గాల ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏడాదికాలంగా చేస్తున్న కృషి నియోజకవర్గంలో ఫలితాలిస్తుంది. డయాలసిస్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం ఆస్పత్రిలో మిషన్‌లు పెంచి సేవలను విస్తరించారు. అదేవిధంగా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని కూనంనేని సాధించిపెట్టారు. గతంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 5 మిషన్లు యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిసిన అనంతరం డయాలసిస్ రోగుల ఇబ్బందులను గుర్తించి మిషిన్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేశారు. పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులను, వైద్యశాఖ ఉన్నతాధికారులను సంప్రదించి నియోజకవర్గానికి ఏడాది కాలంలో అదనంగా 15 యంత్రాలను మంజూరు చేయించగలిగారు. ప్రస్తుతం పాల్వంచలో ఐదు మిషన్లు అందుబాటులో ఉండగా మరో ఐదు మిషన్లను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం ఐదు మిషన్లు అందుబాటులో ఉండగా మరో ఐదు మిషన్లు అందుబాటులోకి రానున్నాయి.
మర్చి 16న కూనంనేని సాంబశివరావు చేతులమీదుగా నూతనంగా మంజూరైన మిషన్లు ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో 20 మిషన్లు డయాలసిస్ రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండగా ప్రతి రోజు రెండొందల మందికి డయాలసిస్ సేవలు అందనున్నాయి.
కొత్తగూడెం ఆస్పత్రిలో 15 మిషిన్లకు పెంచేందుకు కృషి జరుగుతోందని కూనంనేని సాంబవివరావు అన్నారు. రాష్ట్ర వ్యాపితంగా ఏ నియోజకవర్గంలోనూ ఇరవై మిషన్లు అందుబాటులో లేని పరిస్థితి ఉండగా కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో కూనంనేని సాంబశివరావు కృషితో పేద రోగులకు 20 మిషన్లు డయాలసిస్ సేవలు అందనున్నాయి. డయాలసిస్ యంత్రాల మంజూరు కోసం, ప్రభుత్వ వైద్యం బలోపేతం కోసం కూనంనేని చేస్తున్న కృషిని పేదవర్గాల హర్షిస్తున్నాయి.