బీజింగ్ సమావేశంలో చైనా, రష్యా, ఇరాన్ నిర్ణయం
బీజింగ్: నేడున్న పరిస్థితుల దృష్ట్యా తాము కలిసికట్టుగా ముందుకెళ్లాలని, పరస్పరం సంప్రదింపులు జరుపుకుంటూ సమన్వయంతో సవాళ్లను అధిగమించాలని చైనా, రష్యా, ఇరాన్ దేశాలు నిర్ణయించాయి. చైనా రాజధాని బీజింగ్‌లో మూడు దేశాల ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి మా జావుషూ అధ్యక్షత వహించారు. అణ్వస్త్రాలు, ఆంక్షలు, అంతర్జాతీయ సవాళ్లు, ప్రాదేశిక అంశాలపై ముగ్గురు ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. తమ సహకార బంధాన్ని మరింతగా బలపర్చుకోవాలని నిశ్చయించారు. చట్టవిరుద్ధ ఏకపక్ష ఆంక్షల రద్దు అవశ్యకతను చర్చించారు. రాజకీj, దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, పరస్పరం సంప్రదింపులు జరుపుకోవాలని, కలిసి కట్టుగా ముందుకెళ్లాలని, మరింతగా సహకరించుకుందామని, ప్రతినిధులు నిర్ణయించారు. యూఎన్‌ఎస్‌సీ తీర్మానం, నాన్ ప్రొలిఫిరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ (ఎన్‌పీటీ) ఒప్పందంపై చర్చించారు. అందుకు కట్టుబడాలని వక్కాణించారు. శాంతి కోసమే అణ్వస్త్రాలు తయారు చేస్తున్నట్లు ఇరాన్ చెప్పడాన్ని స్వాగతించారు. ఎన్‌పీటీకి కట్టుబడి ఉంటామన్న ఇరాన్ మాటలను గౌరవించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)తో సహకారాన్ని కొనసాగించేలా ఇరాన్ విధానానికి మద్దతు ప్రకటించారు. ఐఏఈఏకు సంబంధించిన సాంకేతిక ఇతరత్రా పనులకు ఏ విధంగా విఘాతం కలగకుండా చూడాలని మూడు దేశాల ప్రతినిధులు సంకల్పించారు. బీజింగ్‌లో ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ… ఈ సమావేశం ఏర్పాటులో నిర్మాణాత్మక పాత్ర పోషించిన చైనాను అభినందించారు. భవిష్యత్‌లో మరింత సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రాదేశిక, అంతర్జాతీయ పరిణామాలు, సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ సంస్థలు, బ్రిక్స్, షాంఘై సహకార సంఘం వంటివాటికి సంబంధించి తమ మధ్య సహకార బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని చైనా, ఇరాన్, రష్యా నిర్ణయించాయి.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేత
రష్యా చమురు కొనుగోలును చైనా నిలిపివేసింది. ఈ నెలలో రెండు సంస్థలు కొనుగోళ్లనూ పూర్తిగా నిలిపివేయగా… మరో రెండు సంస్థలు కొనుగోలు చేసే చమురు పరిణామాన్ని తగ్గించాయి. జనవరిలో రష్యా చమురు ఉత్పత్తిదారులు, ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. దీంతో కొనుగోళ్లు తగ్గాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం క్రమంలో రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాలుగా చైనా, భారత్ నిలిచాయి. చైనా తరహాలోనే భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి ముడిచమురు దిగుమతులను పెంచింది.
సమన్వయంతో పనిచేద్దాం
RELATED ARTICLES