జిల్లా ఏ ఓ అలెగ్జాండర్ కు వినతి పత్రం అందజేసిన ఏ ఐ వై ఎఫ్ నాయకులు
విశాలాంధ్ర -అనంతపురం : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని సోమవారం అఖిలభారత యువజన సమాఖ్య గా ( ఏఐవైఎఫ్ ) కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం అనంతపురం ఏ ఓ అలెగ్జాండర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులు ఎన్డీఏ నూతన ప్రభుత్వంపై నమ్మకంతో ఎన్నికల అనంతరం నిరుద్యోగులు ఓట్లు వేసి గెలిపించి ఖాళీలు భర్తీ చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నవారికి తొమ్మిది నెలలు అవుతున్న పూర్తి నిరాశని చవి చూశారన్నారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగలు దశాబ్దాల కాలంగా విద్యని అభ్యసించి పట్టభద్రులు అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ వేలాది రూపాయల కోచింగ్ సెంటర్ కి వెచ్చిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని స్వయంగా ప్రభుత్వమే తమ ఎన్నికల ప్రచారంలో చెప్పారని నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 18 క్యాబినెట్ సమావేశలు అయినప్పటికీ క్యాబినెట్ సమావేశాలు చర్చించకపోవడం సిగ్గుచేటు అన్నారు. నిరుద్యోగులకు బృతి అంశం మీద చర్చకు వస్తుందని భావించిన నిరుద్యోగులు చాలా నిరాశకు గురయ్యారున్నారు. నిరుద్యోగ సమస్యల్లో అందులో ముఖ్యమైన అంశం నిరుద్యోగులకు ప్రతి నెల 3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.
అనంతపురం డీఎస్సీ 25వేలతో ప్రకటించి ఎస్జీటీ పోస్టులు 180 నుంచి 1000 కి పెంచేలా చూస్తారండి ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయని పరిస్థితి. రోస్టర్ విధానం వల్ల గ్రూప్ టు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వెంటనే జీవో నెంబర్ 77ను రద్దుచేసి గ్రూప్ 2 ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నమన్నారు..జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి వైద్య విద్యను అర్హులైన మరియు సామాజిక ఆణగారిన వర్గాల విద్యార్థులందరికీ వైద్య విద్యను అభ్యసించడానికి అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ , టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ అవసరం ఉందన్నారు. జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని, మూతబడ్డ 4,500 ప్రాథమిక పాఠశాలలను పునః ప్రారంభించాలన్నారు.
గతంలో మూతపడ్డ 4,500 పాఠశాలలను పునప్రారం చేసి అనంతరం మెగా డీఎస్సీ నిర్వహించాలని, ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చలర్ పోస్టులను భర్తీ చేయాలనీ తదితర డిమాండ్లతో ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు కార్యదర్ములు దేవా, ధనుంజయ్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు రాంబాబు నాగయ్య, అభి తదితరులు పాల్గొన్నారు.