Friday, May 9, 2025
Homeజిల్లాలుఅనంతపురంఆరోగ్య కేంద్రాలకు వైద్యులను నియమించండి

ఆరోగ్య కేంద్రాలకు వైద్యులను నియమించండి

విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులను నియమించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రాలకు వైద్యులను నిర్మించాలని తాసిల్దార్ రజాక్ వలికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ పట్టణంలోని టైలర్స్ కాలనీ, పాతకోట, అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దాదాపు రెండు సంవత్సరాల నుండి వైద్యులు లేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగించాలంటే ఉపాధి పనులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా నిత్యవసరకులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళితే టోకెన్ ఫీజు, రక్త పరీక్ష తదితర ఫీజుల పేరుతో దాదాపు 1000/-రూపాయల నుండి 1500/- రూపాయల వరకు ఖర్చవుతుంది. కావున అధికారులు, ప్రజా నాయకులు స్పందించి పేదల ఆసుపత్రులైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులను నియమించాలని కోరారు. లేనిపక్షంలో పేద, మధ్యతరగతి ప్రజలతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పలు రూపాయలలో ధర్నా చేస్తామని అధికారులను హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య సంఘం అధ్యక్షుడు సాలవేముల సూరి సిపిఐ నాయకులు నాగార్జున, నాగేంద్ర ఏఐటీయూసీ నాయకులు వెంకటరమణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు