Friday, May 9, 2025
Homeహైదరాబాద్దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టేలా అసెంబ్లీలో కృషి చేయాలి

దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టేలా అసెంబ్లీలో కృషి చేయాలి


కూనంనేనికి వినతిపత్రం అందజేసిన ధనుంజయనాయుడు
విశాలాంధ్ర – హైదరాబాద్‌ : బీసీలకు స్థానిక సంస్థలలో, విద్య ఉద్యోగాలలో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈరోజు తెలంగాణా అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపుతామనీ రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనతో పాటు కులజనగణన చేపట్టి బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో ప్రభుత్వ, ప్రయివేటు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో, బడ్జెట్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలనే అంశాన్ని లేవనెత్తి, ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపే విధంగా అసెంబ్లీలో కృషి చేయాలని కోరుతూ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో సిపిఐ ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావును కలిసి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు, సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ బిల్లు ఆమోదింపజేసి కేంద్రాన్ని ఒప్పించి షెడ్యూల్‌ 9లో చేర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చేయాలని అందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష బీసీ సంఘాలను బీసీ ఎమ్మెల్యేలను అఖిలపక్ష పార్టీల నాయకులను ఢల్లీికి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, రాష్ట్రానికి చెందిన బీసీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో కలిసి రావాలని దేశ వ్యాప్తంగా జరగాల్సిన జనగణన, కులగణన పట్ల బీజేపీ నాయకులు మౌనం వీడాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు