ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర – హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఐదు లక్షల మంది యువత ఉపాధి కోసం ప్రభుత్వం రూ.ఆరు వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ఆయన ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ 15 నెలల్లో 57 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నామని పేర్కొన్నారు. 43 లక్షల కుటుంబాలు రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు, స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడిరచారు. 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించామని చెప్పారు. కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నామన్నారు. బీసీల లెక్క 56.36 శాతంగా తేలిందని, వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా, అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదన్నారు. దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, నిరుద్యోగ సమస్యను 8.8 నుంచి 6.6 తగిందని, నిత్యావసర వస్తువుల ధరల తగ్గుదలలో 1.3 తో దేశంలోనే తెలంగాణ ముందు ఉందన్నారు. ఇది మేం చెప్పేది కాదు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచిన గణాంకాలుగా వెల్లడిరచారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించామని, జూన్ రెండో తేదీన లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, ఇది పార్టీ పథకం కాదు ప్రజల పథకంగా పేర్కొన్నారు.
‘రాజీవ్ యువ వికాసం’తో5 లక్షల మందికి ఉపాధి
RELATED ARTICLES