విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి తో పాటు స్టోర్ డీలర్లు మాట్లాడుతూ ప్రతినెల ఆరో ప్రకారం మాకు ఇచ్చే బియ్యం పంపిణీలో కోత విధించడం జరుగుతోందని, అలా కాకుండా పూర్తిగా మా కోటాను ఇవ్వగలిగితే ప్రజలకు తప్పకుండా అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. నిత్యావసర సరుకులు తక్కువ రావడంతో ప్రజలకు తాము ఏ విధంగా పంపిణీ చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి దశలో మా కోట రాకపోవడం, కోత కోయడం వల్ల మాతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులకు గురి కావడం సరికాదని తెలిపారు. కందిబేళ్లు మూడు నెలలు గడిచినా రాలేదని జొన్నలు రెండు నెలలు గడిచిన రాలేదని వారు తెలిపారు. స్పందించిన ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ బఫర్ వల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నామని, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం జరిగే విధంగా తాను కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోర్ డీలర్లు పాల్గొన్నారు.
డీలర్ల సమస్యలను పరిష్కరించండి.. మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి
RELATED ARTICLES