వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సన్నద్ధతపై డిఆర్డీఏ, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకు నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, ఎల్డిఎం నర్సింగరావు, సిపిఓ అశోక్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆర్.ఆదోని, లేబర్ డీసీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.