Saturday, April 19, 2025
Homeఅంతర్జాతీయంకోలుకుంటున్న ప్రపంచ మార్కెట్లు...

కోలుకుంటున్న ప్రపంచ మార్కెట్లు…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనల ప్రభావం నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. ట్రంప్ టారిఫ్ విధానాల కారణంగా గత సెషన్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు నేడు పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా, నిఫ్టీ మళ్లీ 22,500 మార్కుకు ఎగబాకింది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1180.73 పాయింట్లు లాభపడి 74,318.63 వద్ద, నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 22,522.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

మరోవైపు, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు కోలుకున్నాయి. నేటి సెషన్‌లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని భావిస్తున్నారు. కాగా, నిన్న దేశీయ మార్కెట్లు ఊహించనంతగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,226 పాయింట్ల నష్టంతో 73,137కి దిగజారింది. నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161కి పతనమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు