Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటికి భూమిపూజ

అమరావతిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటికి భూమిపూజ

సచివాలయం వెనుక వెలకపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు ఇల్లు
భూమి పూజకు హాజరైన నారా, నందమూరి కుటుంబ సభ్యులు

1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో ఇంటి నిర్మాణం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో కట్టుకుంటున్న సొంత ఇంటికి భూమిపూజ జరిగింది. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సచివాలయం వెనుక జు9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నివాసంతో పాటు, పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటిని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో నిర్మించనున్నారు. ఏడాదిన్నర సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు