Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం

నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణ మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. రాములోరి కల్యాణాన్ని లక్షమంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కల్యాణ వేదికలో వేద పండితుల సమక్షంలో నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని వారు వీక్షిస్తారు. భక్తులు కూర్చునేందుకు కల్యాణ వేదికకు ఇరువైపులా 147 గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే, 13 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు