Homeతెలంగాణఅతివేగంగా డివైడర్‌ను ఢీకొని...ఇంటి గోడపైకి ఎక్కిన కారు!!

అతివేగంగా డివైడర్‌ను ఢీకొని…ఇంటి గోడపైకి ఎక్కిన కారు!!

- Advertisement -

మేడ్చల్ జిల్లా శంభీపూర్‌లో కారు భీభత్సం సృష్టించింది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ కారును డివైడర్‌కు ఢీ కొట్టాడు. అనంతరం కారు ఎగిరి ఇంటి గోడపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును కిందకు దించారు. దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..అక్కడెలా పెట్టావురా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు