Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం


విశాలాంధ్ర -తనకల్లు : నూతనంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యునిగా ఎన్నికైన సోమ పాలెం నాగభూషణంను మండల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం దృశ్యాలువాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయి బ్రాహ్మణులకు పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని సోమ పాలెం ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. సోమ పాలెం మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన గౌరవనీయులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ ఉన్నంతవరకు, కందికుంట బాటలోనే నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సాధికారిక కమిటీ సభ్యులు మీరాసి వేమనా రాయణ జనసేన మండల కన్వీనర్ కె.వి రమణ రాజన్న ఆదినారాయణ శ్రీనివాసులు ఆది శివ శంకర బాబు హరి శ్రీనివాసులు సాయి రామాంజులు ఉపేంద్ర నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.-

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు