విశాలాంధ్ర ధర్మవరం:: సామాజిక చైతన్య సంస్థ కడప వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్సార్ ప్రెస్ క్లబ్లో జరిగిన జాతీయ సదస్సులో ధర్మవరం పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ సత్య నిర్ధారణ, పోలా ప్రభాకర్లను ఘనంగా సన్మానించారు. డాక్టర్ సత్య నిర్ధారణ ఈ సదస్సు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సేవలను అందించడం జరిగిందని ఎన్జీవో ద్వారా వృద్ధుల సామాజిక ఆరోగ్య ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నందున వీరి అపురూప సేవలను గుర్తించి సదస్సు చైర్మన్ నార్ల ప్రకాష్ ఈవెంట్ పార్ట్నర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ రాజు తదితర జాతీయ ప్రముఖుల ద్వారా సన్మానం చేసి జ్ఞాపకం అందజేశారు. ఇక పోలా ప్రభాకర్ ఇండియన్ రెడ్ క్రాస్, యువర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో భిన్నమైన అత్యంత ప్రయోజనమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, వృద్ధుల జీవితాల గురించి తెలుసుకొని ఆదుకోవడం, మన బంధు కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ సదస్సు చైర్మన్ నార్ల ప్రకాశం రాయలసీమ మనోబంధు కోఆర్డినేటర్ శివారెడ్డి సోమల రాజు ఫౌండేషన్ రాజు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. సన్మాన గ్రహీతలు డా.సత్య నిర్ధారణ, ఓలా ప్రభాకర్లు మాట్లాడుతూ మాకు ఈ గౌరవం ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందని, పేద ప్రజలకు మరిన్ని సేవలను మున్ముందు చేస్తామని తెలిపారు.
స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు ఘన సన్మానం
RELATED ARTICLES