డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.77 లక్షల రియాల్స్‌కు పడిపోయినట్లు వ్యాపారుల వెల్లడి
ఇరానియన్ రియాల్ భారీ స్థాయిలో పతనమవుతోంది. ఓ పక్క పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇరాక్ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటుండగా, మరో పక్క కరెన్సీ కష్టాలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఇరానియన్ రియాల్ మరింత పడిపోవడం ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. డాలరుతో పోలిస్తే మారకపు విలువ ఈ నెలలోనే దాదాపు పది శాతం పడిపోయింది. 2015లో శక్తిమంతమైన దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకున్న సమయంలో డాలరు మారకపు విలువ 32 వేలుగా ఉండగా, ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఈ ఏడాది జులైలో అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన రోజు డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.03 లక్షల రియాల్స్‌కు పతనమయింది. ప్రస్తుతం అది 7.77 లక్షల రియాల్స్‌కు పడిపోయినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ
RELATED ARTICLES