విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరానికి చెందిన యువ రచయిత. బిజెపి యువ మోర్చా పి. రామకృష్ణారెడ్డి మైసూరులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సి ఐ ఐ ఎల్ )నుండి లింగ్విస్టిక్ కన్నడ పట్టా పొందినట్లు వారు తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు లిట్ చేసిన తాను స్వతహాగా రచయిత అవ్వడం వల్ల ఇతర భాషల అధ్యయనం చేయడం వల్ల భాషా పరిజ్ఞానం పెరిగింది అన్నారు.తాను కన్నడ భాషాధ్యయనం చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి 80 వేల రూపాయల స్టైఫండ్ పొందినట్లు తెలిపారు. తమిళనాట ఇప్పుడు హిందీ భాష పట్ల అధికార నాయకుల ప్రవర్తన చూస్తుంటే బాధేస్తోందని, తాను ఇప్పుడు తమిళం కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కువ భాషలు నేర్చుకుంటే వివిధ రాష్ట్రాల మాండలికాలు, సంస్కృతి ఆచార వ్యవహారాలతో పాటు మాతృభాష మీద పట్టురావడమే కాకుండా, భాష మీద మరింత మమకారం ఏర్పడుతుందని ఆయన అన్నారు. భాషాధ్యయనం కొరకు ప్రభుత్వమే ప్రత్యేక నిధులను కేటాయించాలని, ఎవరు ఎన్ని భాషలు నేర్చుకున్నా వారి మాతృభాషలో సంభాషణ జరిపితే మానసిక పరిపక్వత వికసిస్తుందని వారు అన్నారు.
కన్నడ భాష యందు పట్టా పొందిన రామకృష్ణారెడ్డిని ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
సిఐఐఎల్ కన్నడ పట్టా పొందిన ధర్మవరం వాసి
RELATED ARTICLES