విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ కార్యదర్శి మహేశ్, టీడీపీ నాయకులు హనుమంతు, సినిమా రామాంజనేయులు, చంద్రశేఖర్, సూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించిన పయ్యావుల సోదరులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.


