Homeజిల్లాలుఅనంతపురంమంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్..

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్..

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరై తమ సమస్యలను మంత్రి కి వివరించారు. మంత్రి స్వయంగా ప్రజల వినతులను శ్రద్ధగా విని, వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తూ, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు