Homeజిల్లాలుఅనంతపురంకాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ – యువకుడు మృతి

కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ – యువకుడు మృతి

- Advertisement -

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రాక్టర్ బిటిపి కుడికాలువలోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కపటలింగనపల్లి గ్రామానికి చెందిన నితిన్ (16) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడే ట్రాక్టర్ నడుపుతున్నట్లు ప్రాథమిక సమాచారం. వేగం ఎక్కువగా ఉండటం వల్లే ట్రాక్టర్ అదుపుతప్పి కుడికాలువలోకి దూసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కపటలింగనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు