Homeజిల్లాలుఅనంతపురంపండుగ పూట పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.. సిఐ

పండుగ పూట పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.. సిఐ

- Advertisement -

విశాలాంధ్ర – శింగనమల..సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని శింగనమల నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య హెచ్చరించారు.శింగనమల సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, శింగనమల సర్కిల్ పరిధిలోని శింగనమల, నార్పల, గార్లదిన్నె మండలాల్లో సంక్రాంతి పండుగ రోజులలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పండుగ పేరుతో గ్రామాల్లో మద్యం సేవించి అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రత్యేకంగా కోడిపందేలు, పేకాట, మట్కా, జూదం, గ్యాంబ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై, అలాగే వాటిని నిర్వహించే నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. తప్పు చేసిన వారెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు.సాంప్రదాయ క్రీడల పేరుతో దౌర్జన్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణంలో, సామరస్యంగా పండుగలను నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.యువకులు ఆన్లైన్ గేమ్‌ల పేరిట జూదాలకు బానిసలై కేసుల్లో ఇరుక్కొని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య హితవు పలికారు. చట్టానికి విరుద్ధమైన క్రీడలకు దూరంగా ఉండి, సంస్కృతి–సాంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు