-50 లక్షలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలి
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ
విశాలాంధ్ర – గణపవరం (ఏలూరు జిల్లా) : రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమ బోర్డు వెంటనే ప్రారంభించాలని 50 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ అన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసి ఆధ్వర్యంలో గణపవరం లో ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ని కలిసి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పునరుద్దించాలని, కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన భవన నిర్మాణ కార్మికుల హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేయడం జరిగింది.దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఏడిది వెంకట వేణుగోపాలకృష్ణ, గణపవరం మండలం యూనియన్ అధ్యక్షులు సబ్బారపు నారాయణరావు, మాజీ అధ్యక్షులు ఆదిశేషు, పుల్లూరి శ్రీనివాసు, వెంకటేశ్వరరావు, ఆవులు కొండయ్య, యాల రాంబాబు, అంబటి శీను తదితరులు పాల్గొన్నారు.