క్రీడలు : టీ -20 ప్రపంచ కప్ లో తరచుగా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు సంజు సాంసంగ్ మద్దతుగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం క్రికెట్ లో సర్వసాధారణమేనని, తనదైన రోజున అభిషేక్ విజృంభిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంటుంది. అభిషేక్ మీద విపరీతమైన నమ్మకం తమకు ఉందన్నాడు. ప్రతి క్రికెటర్ ఖరీర్ లో ఎత్తు పల్లాలు ఉంటాయని ఆ సమయంలో ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. అతడు టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో రాణిస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. టి20 క్రికెట్ చాలా విచిత్రమైందని ప్రపంచంలో కెల్లా అత్యుత్తమమైన వారు సైతం ఈ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు అని సంజు శాంసన్ పేర్కొన్నాడు. అభిషేక్ ఆట తీరుపై తమకు నమ్మకం ఉంది. ఫైనల్ మ్యాచ్ లో ఆయన సత్తాను నిరూపించుకోగలడు అని సంజు అన్నాడు.
అభిషేక్ శర్మ రాణిస్తాడు : సంజు శాంసన్
- Advertisement -
RELATED ARTICLES


