జిల్లా ఎస్పీ రత్న
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో మరింత అభివృద్ధిని సాధించాలని కోరుతూ జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లాలో ధర్మవరంలో ట్రాఫిక్కు నియంత్రణపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పుట్టపర్తిలో ధర్మవరం ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ వెంకట్ రాముడు విధులలో మంచి నైపుణ్యం, సిబ్బందికి మంచి సూచనలు ఇవ్వడంలో సఫలం కావడంతో ఎస్పీ రత్న ప్రశంసా పత్రాన్ని వెంకటరాముడుకు అందజేశారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరాముడు ఎస్పీ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మారంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ లను పాటించాలని తెలుపుతూ, ధర్మవరం ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది సహకారంతో మరింత కృషి చేస్తానని వారు స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణలో మరింత అభివృద్ధి సాధించండి..
- Advertisement -
RELATED ARTICLES


