యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదానముతో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత షేక్ బాషా అని యువర్ ఫౌండేషన్ కోశాధికారి మోహన్, కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తుంపర్తి కాలనీలో 60 సంవత్సరాశ్రీబ వయసు గల షేక్ బాషా మృతి చెందడం జరిగింది. యువర్ ఫౌండేషన్ వారు కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల సహకారంతో యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రెట్రావెల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర ద్వారా నేత్రాలను సేకరించారు. అనంతరం నేత్రదానానికి సహకరించిన భార్య సహిదా, కుమార్తె సదాకిని లకు యువర్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలను తెలియజేశారు.
నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత షేక్ బాషా
- Advertisement -
RELATED ARTICLES


