శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కోశాధికారి, చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి), అధ్యక్షులు బివి.రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 113 వా ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాలు కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేటి శిబిర దాతగా కీర్తిశేషులు కుండా లక్ష్మీ దేవమ్మ, కీర్తిశేషులు కుండా కిష్టప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు శారదమ్మ కుండా చౌడయ్య వారి కుమారులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు వివేక్ కుల్లాయప్ప, వెంకటేశ్వర్లు, జై దీపు నేత, సతీష్ కుమార్, విట్టల్, ప్రణయ్, వినయ్ కుమారులు రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. తదుపరి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందన్నారు. బిపి, షుగర్, ఇతర పరీక్షలు, వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఒక నెలకు సరిపడు మందులను ఉచితంగా దాతలచే రోగులకు అందించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో 310మంది రోగులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


