Thursday, December 19, 2024
Homeజిల్లాలుఅనంతపురంఅదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

అదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

ప్రమాద బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర -అనంతపురం : యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామం వద్దనున్న అదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6:30 నుంచి 7:00 మధ్యలో బోయరెడ్డిపల్లి గ్రామం వద్దనున్న అదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగగా, అందులో గాయపడిన 4 బాధితులను నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, బుధవారం రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో ప్రమాద బాధితులను శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి), జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పరామర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ కార్మికులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స గురించి ఎలాంటి ఆందోళన వద్దని, యాజమాన్యం, ప్రభుత్వం నుంచి చికిత్సకు అయ్యే ఖర్చు భరించి ఉత్తమ చికిత్స అందిస్తామని వారికి ధైర్యం అందించారు. ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే నేరుగా తమని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగింది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి), జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని బెంగళూరుకి తరలించి వారికి ఉత్తమ చికిత్స అందించేలా అవసరమైన చర్యలు వెంటనే తీసుకుంటామని తెలిపారు. గాయపడిన నలుగురిని ప్రత్యేక అంబులెన్స్ లలో బెంగుళూరుకు తరలించారు. అంబులెన్స్ లలో టెక్నికల్ మెడికల్ టీంలు, రెవెన్యూ సిబ్బందిని వెంట పంపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డిఓ కేశవ నాయుడు, యాడికి తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు