సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర -ధర్మవరం; ఏఐటియుసిఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ (మేడే )కార్యక్రమం ధర్మవరం లో కదిరి గేట్ నందు నేతన్న విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణను ముఖ్య అతిథిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కార్మికులు ఈ సమాజానికి మూల స్తంభాలు వారి కృషితోనే ప్రగతి పఠములో నడుస్తున్నాము అని తెలిపారు.దేశంలోని కార్మికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు కార్మిక చట్టాలు ఉంటే నాలుగు కార్మిక లేబర్ కోడ్లగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల లపైన నిరంకుశ ధోరణి వ్యవహరిస్తూ కార్మికులను అణగదొక్కుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన వ్యతిరేకంగా ఈరోజు 139 వ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక ఉపాధ్యాయ విద్యార్థి మేధావుల ఐక్యత వర్ధిల్లాలని తెలిపారు. అదేవిధంగా,ఫ్యాక్టరీలలో 12 గంటల విధానాన్ని రద్దు చేస్తూ, ఎనిమిది గంటల పని విధానాన్ని కల్పించాలని కార్మికులను నిరంకుశ ధోరణితో శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలలో కార్మికులకు మంచి ఆహారము అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రంశెట్టి రమణ,చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు,ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్స్ అసోషియన్ అధ్యక్షులు, గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంజనేయులు,తాజుద్దీన్, మసూద్, సుబ్బయ్య,నాగేంద్ర, పీరా, బాషా, పట్టణ నాయకులు శ్రీధర్, ఆదినారాయణ, మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ,ఈరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు ఈ సమాజానికి మూల స్తంభాలు
RELATED ARTICLES